విత్తనాల్లో జీవం ఎంతకాలం ఉంటుంది? ప్రత్యేక పరిస్థితుల్లో వాటిని భద్రపరిస్తే తిరిగి ఏ మేరకు మొలకెత్తుతాయి? అనే కోణంలో జరుగుతున్న పరిశోధనల్లో ఇక్రిశాట్ కూడా పాల్గొంటోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధరకాల పంటలకు చెందిన విత్తనాలను ఆర్కిటిక్ ఖండంలో ఉన్న స్వాల్‌బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్‌లో భద్రపరిచే ప్రక్రియ 2008లో ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉండే లక్షలాది రకాల విత్తనాలను అక్కడ భద్రపరుస్తున్నారు. భవిష్యత్తు అవసరాలతో పాటు ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఆహారోత్పత్తికి ఇబ్బందులు తలెత్తకుండా చూడడం, మూల విత్తనాల జీన్స్‌ను కాపాడాలనే లక్ష్యాలతో ఈ ప్రాజెక్టు కొనసాగుతోందని ఇక్రిశాట్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
'విత్తనాల్లో జీవం ఎంతకాలం ఉంటుంది.. ఎన్నేళ్లు భద్ర పరచొచ్చు' - విత్తనానికి వందేళ్ల పరీక్ష!
విత్తనాలను ఎంతకాలం వరకు భద్రపరచొచ్చు... వాటిలో జీవం ఎంతకాలం వరకు ఉంటుందనే పరిశోధనల్లో ఇక్రిశాట్ పాల్గొంటోంది. వివిధ పంటల విత్తనాలను భద్రపరిచి వాటిపై పరిశోధనలు చేస్తారు. ఆర్కిటిక్ ఖండంలో ఉన్న స్వాల్‌బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్‌లో భద్రపరిచే ప్రక్రియ 2008లో ప్రారంభమైంది.
ఇక్రిశాట్‌తో పాటు థాయ్‌లాండ్, బ్రెజిల్, జర్మనీ, స్వీడన్ దేశాలకు చెందిన 5 ప్రతిష్ఠాత్మక పరిశోధనా సంస్థల ఆధ్వర్యంలో అక్కడ భద్రపరచిన విత్తనాల మీద పరిశోధనలు జరుగుతుంటాయి. ప్రతి పదేళ్లకోసారి చొప్పున వందేళ్ల పాటు ఈ పరీక్షలు సాగుతాయి. వాటిలో జీవం ఎంతవరకు ఉందో, మొలకెత్తే అవకాశాల గురించి పరిశోధనలు జరుపుతారు. తాజాగా గత నెల 28న బార్లీ, గోధుమ, బఠానీ, పాలకూర విత్తనాలను అందులో భద్రపరిచారు. వచ్చే మూడేళ్లలో మరో 9 రకాల విత్తనాలను ఆ వాల్ట్‌లో ఉంచేందుకు అందజేస్తారు. వేరుశనగ, సజ్జ, కంది, సెనగ విత్తనాలను ఇక్రిశాట్ అందజేస్తుంది.
ఇవీ చూడండి: ఈ నెల 7 నుంచి భాగ్యనగరంలో మెట్రో కూత..