తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలకు విశాఖ కేజీహెచ్ ఎంపిక - కరోనా వ్యాక్సిన్ పరీక్షలు వార్తలు

కరోనా వైరస్‌కి భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకాను అందుబాటులోకి తెచ్చే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. మనుషులపై చేసే ప్రయోగాలు విజయవంతమైతే.. ఆగస్ట్‌ 15 నాటికి మార్కెట్లోకి విడుదల చేయాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ చర్యల్లో భాగంగా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణ కోసం విశాఖ కేజీహెచ్‌ ఆస్పత్రిని ఐసీఎంఆర్‌ ఎంపిక చేసింది.

కరోనా వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలకు విశాఖ కేజీహెచ్ ఎంపిక
కరోనా వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలకు విశాఖ కేజీహెచ్ ఎంపిక

By

Published : Jul 3, 2020, 6:45 PM IST

కరోనా వ్యాక్సిన్​ను వీలైనంత త్వరగా అందుబాటులకి తీసుకొచ్చేందుకు భారత్​ అడుగులు వేస్తోంది. ఇప్పటికే భారత్ బయోటక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకాకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) క్లినికల్ ట్రయల్స్​కు అనుమతిచ్చింది.

కరోనా వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో ఏపీ నుంచి విశాఖ కేజీహెచ్​ను భారత వైద్య పరిశోధన మండలి ఎంపిక చేసింది. అలాగే వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలకు నోడల్ అధికారిగా కేజీహెచ్ వైద్యుడు డాక్టర్ వాసుదేవ్​కు బాధ్యతలు అప్పగించారు. ఆయన ఇప్పటికే విమ్స్‌లో కరోనా రోగులకు వైద్యం అందించే విధుల్లో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details