రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కొహెడ పండ్ల మార్కెట్‌ను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి సందర్శించారు. మార్కెట్లో కూలీలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఇంత పెద్ద మార్కెట్ ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. లాక్డౌన్ తర్వాత మార్కెట్ వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయని అన్నారు.
కొహెడ మార్కెట్‌ను సందర్శించిన ఎమ్మెల్యే కిషన్ రెడ్డి - IbrahimPatnam Mla visits Koheda fruit market
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కొహెడలో కొత్తగా ఏర్పాటు చేసిన పంట్ల మార్కెట్‌ను స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి సందర్శించారు.
![కొహెడ మార్కెట్‌ను సందర్శించిన ఎమ్మెల్యే కిషన్ రెడ్డి IbrahimPatnam Mla visits Koheda fruit market](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7008077-712-7008077-1588263745721.jpg)
కొహెడ మార్కెట్‌ను సందర్శించిన ఎమ్మెల్యే కిషన్ రెడ్డి
బిజెపి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి సైతం మార్కెట్‌ను సందర్శించారు. దక్షిణ భారతదేశంలోనే పెద్ద మార్కెట్ అయినా గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను కొహెడకు తరలించడం ఈ ప్రాంతానికి మంచి పరిణామం అన్నారు. కరోనా నేపథ్యంలో కనీస మౌలిక వసతులు కల్పించి రైతులు, వ్యాపారులు, ఏజెంట్లు ఇబ్బంది పడకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇవీ చూడండి: 'ప్రవేశ పరీక్షల దరఖాస్తు స్వీకరణ గడువు పెంపు'