సీనియర్ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మి ఏపీ కేడర్‌లోకి చేరారు. తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యి ఏపీ సచివాలయంలోని సాధారణ పరిపాలన శాఖలో ఆమె రిపోర్ట్ చేశారు. ఆమె కేడర్ మార్పునకు సంబంధించి కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ నుంచి అనుమతి రాగా... ఏపీ కేడర్‌లో చేరినట్టు తెలుస్తోంది. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు సిబ్బంది వ్యవహారాలశాఖ ఆమె కేడర్ మార్పునకు అనుమతి ఇచ్చింది.
ఏపీ కేడర్‌కు శ్రీలక్ష్మీ.. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ - ఏపీకి రిపోర్టు చేసిన ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి
ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి... ఏపీ కేడర్‌కు రిపోర్ట్ చేశారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖకు ఆమె రిపోర్టు చేశారు. త్వరలోనే ఆమెకు పోస్టింగ్ దక్కే అవకాశం ఉంది.
ఏపీ కేడర్‌కు శ్రీలక్ష్మీ.. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్
ఇప్పటి వరకు తెలంగాణ కేడర్‌లో కొనసాగిన ఆమె కొంతకాలంగా ఏపీకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నతస్థాయిలో సిఫార్సులు చేసేందుకు ప్రయత్నాలు జరిగినా అవి సఫలీకృతం కాకపోవటంతో ఆమె క్యాట్‌ను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. అఖిలభారత సర్వీసులోని 1988 బ్యాచ్‌కు చెందిన శ్రీలక్ష్మి ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో నిందితురాలిగా అరెస్టై ఉమ్మడి రాష్ట్రంలో సస్పెన్షన్‌కు గురయ్యారు. గతంలోనే ఆమెపై సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది.