IAMC Building Foundation : అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్(ఐఏఎంసీ) శాశ్వత భవన నిర్మాణానికి సీజేఐ, ఐఏఎంసీ రూపకర్త జస్టిస్ట్ ఎన్వీ రమణ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌లు ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లోని ఐకియా వెనుక ఉదయం 8.50 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు,. ఇందులో ట్రస్ట్ సభ్యులు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హిమాకోహ్లి, మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొననున్నారు.
IAMC Building Foundation : ఐఏఎంసీ శాశ్వత భవన నిర్మాణానికి నేడు శంకుస్థాపన - ఐఏఎంసీ
IAMC Building Foundation : దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ శాశ్వత భవన నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరగనుంది. హైదరాబాద్ హైటెక్స్‌లోని ఐకియా వెనుక ఉన్న ప్రాంతంలో ఇవాళ ఉదయం 8.50 గంటలకు సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు.
IAMC Building Foundation in Hyderabad : దేశంలో అంతర్జాతీయ స్థాయి ఆర్బిట్రేషన్ కేంద్రాలు లేనందున హైదరాబాద్‌లో ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జూన్ 14న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిపాదించారు. కేసీఆర్ వెంటనే అంగీకరించి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. ఈమేరకు హైదరాబాద్ నానక్‌రాంగూడలోని ఫీనిక్స్ వీకే టవర్‌లో 25వేల చదరపు అడుగుల్లో తాత్కాలిక ఐఏఎంసీని సిద్ధం చేసి సీజేఐకి అప్పగించారు. శాశ్వతభవనం కోసం పుప్పాలగూడలో కేటాయించిన భూమిలో నేడు ఐఏఎంసీ భవనానికి శంకుస్థాపన జరగనుంది.
IAMC Building Foundation Today : ఐఏఎంసీ ఏర్పాటు ప్రతిపాదన తీసుకురాగానే వెంటనే అంగీకరించడమే గాక.. సీఎం కేసీఆర్.. సత్వరమే చర్యలు తీసుకుని ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారని సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ అన్నారు. దీనికి సహకరించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీది కీలకపాత్ర అని సీజేఐ అన్నారు. సాంకేతిక నైపుణ్యం, నిపుణుల సలహాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.