పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తమ కార్యకర్తలు తిరగబడతారని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలోని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చంద్రబాబును కలిశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానిపై దాడి కేసులో పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన చంద్రబాబుకి వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రతిపక్షనేత... పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. డీజీపీ ఇప్పటికే నాలుగు సార్లు కోర్టు మెట్లు ఎక్కారని గుర్తు చేశారు. సలాం ఆత్మహత్య కేసులో ఏం జరిగిందో పోలీసులు ఆలోచించుకోవాలని హితవు పలికారు.
ఎప్పుడు అవకాశం వచ్చినా మిమ్నల్ని వదిలిపెట్టం: చంద్రబాబు - చంద్రబాబు నాయుడు తాజా వార్తలు
ఎవరో చెప్పారని తెదేపా నాయకులను పోలీసులు ఇబ్బంది పెడితే సహించేది లేదని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అవకాశం వచ్చినప్పుడు అంత సులువుగా వదిలిపెట్టనని హెచ్చరించారు. నిజాయితీగా నడుచుకోవాలని హితవు పలికారు.
ఎప్పుడు అవకాశం వచ్చినా మిమ్నల్ని వదిలిపెట్టం: చంద్రబాబు
జగన్ను నమ్ముకుని ఐఏఎస్లు జైలుకు పోయారు. అలాంటి పరిస్థితి మీకు అవసరమా?. మేము తప్పు చేస్తే శిక్షించండి. అంతేకానీ ఎవరో చెప్పారని మమ్మల్ని ఇబ్బంది పెడితే.. ముందు మాదిరి నేను ఉండను... అన్ని లెక్కలు వేసుకుంటున్నా. ఎప్పుడు అవకాశం వచ్చినా మిమ్నల్ని వదిలిపెట్టం. కోర్టుల ద్వారా శిక్ష పడే వరకు వదిలిపెట్టం- చంద్రబాబు, తెదేపా అధినేత.