తెలంగాణ

telangana

ETV Bharat / city

'వివేకా గుండెపోటుతో చనిపోయారని అవినాష్​రెడ్డి చెబుతుండగా విన్నాను' - YS Viveka murder case updates

YS Viveka murder case: ఏపీ మాజీమంత్రి వివేకా హత్యకేసులో సీబీఐ అధికారులకు పులివెందులవాసి పాలెం జనార్దన్‌రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చింది. వివేకా గుండెపోటుతో చనిపోయారంటూ.. కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి మొబైల్‌ ఫోన్లో ఎవరికో చెబుతుండగా తాను విన్నానని పులివెందులవాసి పాలెం జనార్దన్‌రెడ్డి సీబీఐకి తెలిపారు.

YS Viveka murder
YS Viveka

By

Published : Mar 6, 2022, 10:09 AM IST

YS Viveka murder case: ఏపీ మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకా గుండెపోటుతో చనిపోయారంటూ.. కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి మొబైల్‌ ఫోన్లో ఎవరికో చెబుతుండగా తాను విన్నానని పులివెందులవాసి పాలెం జనార్దన్‌రెడ్డి సీబీఐకి తెలిపారు. వివేకా మృతి చెందారంటూ 2019 మార్చి 15న ఉదయం 6.45 గంటలకు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనకు ఫోన్‌ చేసి చెప్పారని, వెంటనే తాను వివేకా ఇంటి వద్దకు వెళ్లానని చెప్పారు. ఆ సమయంలో అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి.. వివేకా ఇంటి వద్ద లాన్‌లో చర్చించుకుంటున్నారని వివరించారు.

జగన్‌ మామ ఈసీ గంగిరెడ్డికి సంబంధించిన వ్యక్తిగత, దినేష్‌ మెడికల్‌ సెంటర్‌ వ్యవహారాలు చూసే జనార్దన్‌రెడ్డి గతేడాది సెప్టెంబరు 3న సీబీఐ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. ‘2019 మార్చి 15న ఉదయం 6.40 గంటల సమయంలో నేను ఈసీ గంగిరెడ్డి ఇంటికి వెళ్తున్నా. వివేకా ఇంటివద్ద రెండు మూడు వాహనాలు, కొందరు వ్యక్తులున్నారు. 6.45కు శివశంకర్‌రెడ్డి నాకు ఫోన్‌ చేసి వివేకా చనిపోయారని చెప్పారు. నేను వెంటనే వెళ్లాను. బెడ్‌రూమ్‌లో రక్తంతో పాటు, బాత్‌రూమ్‌లో వివేకా మృతదేహం పడి ఉంది. ఆ సమయంలో ఎంవీ కృష్ణారెడ్డి, ఇనయతుల్లా బెడ్‌రూమ్‌లోనే ఉన్నారు’ అని ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు.

ఇదీచూడండి:ఎర్ర గంగిరెడ్డి ఇంట్లోనే వివేకా హత్యకు కుట్ర: సీబీఐ

ABOUT THE AUTHOR

...view details