వైద్య సిబ్బందికి నైతిక మద్దతిచ్చేందుకే నిమ్స్‌కు వచ్చానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన గవర్నర్.. కరోనా బారిన పడిన వైద్యులు, సిబ్బందిని పరామర్శించారు. ఆందోళన చెందొద్దని.. మేమున్నామంటూ భరోసానిచ్చారు.
ఆర్థిక, ఇతర కార్యకాలాపాలు సాగించడానికే లాక్డౌన్ సడలింపులు ఇచ్చారని గవర్నర్ గుర్తుచేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సడలింపులను దుర్వినియోగం చేయొద్దని హితవు పలికారు. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని, భౌతిక ధూరం పాటించాలని సూచించారు. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో జర్నలిస్టులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు మృతికి సంతాపం తెలిపారు.