తెలంగాణ పీసీసీ అధ్యక్ష పీఠం పోటీలో తాను లేనని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తెలిపారు. ఆ పదవిపై తనకు ఆసక్తి లేదన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా... కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. 30వేల ఎకరాల భూమిని అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 13ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆస్తులను కాపాడేందుకే సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినట్లు తెలిపారు.
TPCC: పీసీసీ అధ్యక్ష పదవిపై ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఏమన్నారంటే!
పీసీసీ అధ్యక్ష పదవిపై తనకు ఆసక్తి లేదని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అన్నారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా... కట్టుబడి ఉంటానని తెలిపారు. ఉద్యమ స్ఫూర్తికి వ్యతిరేకంగా తెలంగానేతరులకు భూములు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు. జీవో 13ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
mla sridhar babu
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూములు అమ్ముతుంటే వద్దని ముఖ్యమంత్రికి చెప్పినట్లు శ్రీధర్‌బాబు గుర్తు చేశారు. ఉద్యమ స్ఫూర్తికి వ్యతిరేకంగా తెలంగాణేతరులకు భూములు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు. ఆర్థిక లోటు ఉందని భూములు అమ్మడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే వదిలిపెట్టేదే లేదు: తలసాని