యూఎస్, యూకే దేశాల మాదిరి భారత ఐటీరంగం పూర్తిస్థాయిలో వర్క్ ఫ్రం హోం చేయటం అనేక సవాళ్లతో కూడుకున్నదని హైసియా నూతనాధ్యక్షుడు భరణి కుమార్ అరోల్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర మార్గదర్శకాల ప్రకారం ఈ సోమవారం నుంచి మూడో వంతు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కార్యాలయాల్లో పని ప్రారంభిస్తారని తెలిపారు. ఉద్యోగుల భద్రత దృష్ట్యా.. భౌతిక దూరం, స్టాగర్డ్ లాగిన్, లాగౌట్ విధానాలను అమలుచేయాలని ఐటీ కంపెనీలకు సూచించామన్నారు. లాక్డౌన్ పొడిగింపుతో ఉద్యోగాల్లో కోత, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన నిర్దేశించుకున్న లక్ష్యాల గురించి ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు.
'రెండు మూడేళ్లలో ఐటీ మరింత అభివృద్ధి చెందుతుంది'
ఇతర దేశాల మాదిరిగా భారత ఐటీరంగం పూర్తిస్థాయిలో ఇంటి నుంచి పనిచేయడం అనేక సవాళ్లతో కూడుకున్నదని హైసియా నూతన అధ్యక్షుడు భరణికుమార్ అన్నారు. రెండు మూడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నట్లుగా హైదరాబాద్‌తో ఐటీ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
'రెండు మూడేళ్లలో ఐటీ మరింత అభివృద్ధి చెందుతుంది'