లాక్‌డౌన్ ఆంక్షలున్నా పట్టించుకోకుండా నగరంలో చాలా దూరం నుంచి కొందరు ఎర్రగడ్డ, ఎంజే మార్కెట్ వంటి పెద్ద మార్కెట్లకు వస్తున్నారు. ఏటా రంజాన్ సీజన్‌లో చార్మినార్ పరిసరాల్లో ప్రత్యేకంగా దుకాణాలు ఏర్పాటు చేస్తారు. ఈసారి వాటికి అనుమతి ఇవ్వలేదు. ప్రజలు పెద్ద మార్కెట్ల బాటపట్టారు.
పోటెత్తిన విపణి... గాలికొదిలిన నిబంధనలు - hyderabad people violating lock down rules
లాక్‌డౌన్ నిబంధనలు పట్టించుకోకుండా భాగ్యనగర వాసులు ఎర్రగడ్డ, ఎంజే మార్కెట్లకు తరలివస్తున్నారు. సుదూరాల నుంచి వస్తోన్న ప్రజలతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. లాక్‌డౌన్ ఆంక్షలు గాలికిపోతున్నాయి.

హైదరాబాద్లో లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన
ఆదివారం ఈ రద్దీ పెరిగింది. నగరవ్యాప్తంగా దుకాణాలు, సూపర్ మార్కెట్లు ఉదయం నుంచి కిటకిటలాడాయి. మీరాలంమండి, హుస్సేనీఅలాం, యాఖుత్‌పురా, చాంద్రాయణగుట్ట, బోరబండ, ఎర్రగడ్డ ప్రాంతాల్లో రద్దీ కనిపించింది.
ఎంజే మార్కెట్ రోడ్డు వద్ద ఉదయం సాధారణ రోజుల్లాగే వ్యాపారులు, కొనుగోలుదారులు కనిపించారు. కొన్ని చోట్ల పోలీసులు అదుపు చేయలేక చేతులెత్తేశారు.