హైదరాబాద్ కొత్తపేటకు చెందిన రాచకొండ శివకుమార్, సాయినగర్‌కు చెందిన వనితతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి అనంతరం అన్యోన్యంగా సాగిన కాపురంలో కలహాలు, అనుమానం మొదలైంది. గత 7 సంవత్సరాల నుంచి కుటుంబ తగాదాల వలన భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి...విషయం తెలుసుకున్న పెద్దలు ఇరువురికి సర్ధి చెప్పారు.
అనుమానం వల్లే హత్య జరిగిందా..?
భర్త ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాకపోవడం వల్ల వనిత మూడేళ్లుగా శివకుమార్‌కు దూరంగా ఉంటోంది. నాలుగు నెలల క్రితం ఇద్దరు రాజీపడటంతో వనిత అమెరికాకు వెళ్లింది. భార్యభర్తలు ఇద్దరూ కలిశారని బంధువులు సంబరపడ్డారు. ఇంతలో ఊహించని విదంగా రెండు రోజుల క్రితం వనిత అత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది.