తెలంగాణ

telangana

ETV Bharat / city

'హైదరాబాద్ వాసులు ఆ సమయంలో బయటకు రావొద్దు' - భాగ్యనగరంలో భారీ వర్షం

Rains in Hyderabad: ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య ఏర్పడిన ఉపరతల ద్రోణి కారణంగా హైదరాబాద్​లో భారీ వర్షం కురుస్తోంది. కుండపోత వర్షాలతో  రహదారులపై వర్షపు నీరు నిలిచిపోతోంది. రోడ్లన్నీ చెరువులుగా మారి వాహనదారులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపిలేని వానతో నగర వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Rains in Hyderabad
Rains in Hyderabad

By

Published : Aug 2, 2022, 10:19 AM IST

Rains in Hyderabad: హైదరాబాద్ మహా నగర ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు కొన్ని సూచనలు జారీ చేశారు. భారీ వర్షాలు కురుస్తున్నందున తమ సూచనలు పాటించి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఉదయం 11 గంటల వరకు భారీ వాన పడే అవకాశం ఉన్నందున ప్రజలంతా ఇంటి పట్టునే ఉండాలని చెప్పారు. అత్యవసర సమాయాల్లో బయటకు వస్తే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వాన తగ్గగానే వెంటనే బయటకు రావొద్దని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అందరూ ఓ గంట తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని చెప్పారు. వర్షం తగ్గిన గంట.. రెండు గంటల తర్వాత బయటకు రావాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వరద నీరు భారీగా రహదారులపై చేరడం వల్ల ట్రాఫిక్​కు అంతరాయం కలిగే అవకాశం ఉందని అన్నారు. కొన్ని ముఖ్యమైన రోడ్లలో వాహనదారులు ఇతర మార్గాలను వెళ్లాల్సిన అవసరం ఉందని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details