Drunken Drivers Have to Donate Blood : చిత్తుగా మద్యం తాగి మత్తుగా కార్లు, బైకులు, ఆటోలు, బస్సులు, లారీలు నడుపుకొంటూ వెళ్తున్న మందుబాబులూ.. ఇకపై జాగ్రత్త.. పోలీసులకు పట్టుబడితే జరిమానా చెల్లించడంతోపాటు రక్తదానం చేయాల్సి ఉంటుంది. పంజాబ్ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులను భాగ్యనగర ట్రాఫిక్ పోలీసులూ పరిశీలిస్తున్నారు.
Blood donation by drunken drivers : పంజాబ్ ప్రభుత్వం ఉత్తర్వుల్లో సాధ్యాసాధ్యాలు, ఎవరైనా న్యాయస్థానాలను ఆశ్రయిస్తే ఏవిధంగా ఎదుర్కోవాలన్న అంశాలపై న్యాయనిపుణులతో సంప్రదిస్తున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మద్యం తాగి పట్టుబడినవారికి కోర్టులు జరిమానాతోపాటు 3 నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్‌లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నాయి. ఈ ఏడాది తొలి 6 నెలల్లో 15 వేలమందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో అత్యధికులకు 6 నెలలపాటు డ్రైవింగ్ లెసెన్స్ రద్దయింది.