తెలంగాణ

telangana

By

Published : Oct 7, 2020, 9:27 AM IST

ETV Bharat / city

ఎంసెట్‌లో మెరిశారు.. వందలో 12 ర్యాంకులు హైదరాబాద్​కే...

టీఎస్‌ఎంసెట్‌లో నగర విద్యార్థులు మెరిశారు. వంద లోపు ర్యాంకులను 12 మంది సాధించి సత్తా చాటారు. వీరిలో కొందరు నగరానికి చెందినవారు కాగా మరి కొందరు నగరంలోని కళాశాలల్లో చదువుతూ పరీక్ష రాశారు.

Hyderabad students got top ranks in ts Eamcet 2020 results
ఎంసెట్‌లో మెరిశారు.. వందలో 12 ర్యాంకులు హైదరాబాద్​కే

టీఎస్‌ఎంసెట్‌లో నగర విద్యార్థులు మెరిశారు. వంద లోపు ర్యాంకులను 12 మంది సాధించి సత్తా చాటారు. వీరిలో కొందరు నగరానికి చెందినవారు కాగా మరి కొందరు నగరంలోని కళాశాలల్లో చదువుతూ పరీక్ష రాశారు. రాష్ట్రంలో తొలి ర్యాంకు సాధించిన వారణాశి సాయితేజ మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థి కావడం విశేషం. ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు నగరానికి వచ్చి ఇక్కడి కార్పొరేట్‌, ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్‌ చదువుతున్నారు.

శేరిలింగంపల్లి నల్లగండ్ల ప్రాంతానికి చెందిన కరన్‌ బర్దన్​ ‌ ఎంసెట్‌ ఇంజనీరింగ్‌లో 12వ ర్యాంకు సాధించాడు. వీరి కుటుంబం స్థానిక అపర్ణ సైబర్‌ కమ్యూన్‌లో ఉంటోంది. తండ్రి ప్రబిన్‌ కుమార్‌ బర్ధ.న్‌ కరేలియూ హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో సీఈవో, తల్లి సంచిత బర్ధన్‌ ఓ ప్రైవేటు స్కూల్‌లో ఉపాధ్యాయురాలు. ఇతను జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 144వ ర్యాంకు సాధించాడు. చెన్నై లేదా బొంబే ఐఐటీలో సీఎస్‌ఈ చదవాలని ఉన్నట్లు కరన్‌ తెలిపాడు.

వెంగళరావునగర్‌ డివిజన్‌ సిద్ధార్థనగర్‌కు చెందిన తెలుగు సూరజ్‌ 57వ ర్యాంకు సాధించాడు. ఆదిభట్లలో ఓ ప్రైవేటు కళాశాలలో చదివాడు. కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేయాలనుందని తెలిపాడు.

తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాల్లో సరూర్‌నగర్‌ డివిజన్‌ గోకుల్‌నగర్‌ కాలనీకి చెందిన ఎరవెళ్లి శ్రీహర్షిత 11వ ర్యాంక్‌ సాధించి సత్తా చాటింది. శ్రీహర్షిత తండ్రి వీరయ్య ఓ ప్రైవేట్‌ మార్కెటింగ్‌ కంపెనీలో ఉద్యోగి, తల్లి కావ్య గృహిణి. బట్టీ పట్టకుండా సబ్జెక్ట్‌లోని అంశాలను అర్థం చేసుకుని చదివి మంచి ర్యాంక్‌ తెచ్చుకోగలిగానని శ్రీహర్షిత తెలిపింది. కంప్యూటర్‌ సైన్స్‌లో చేరి వ్యాపారవేత్తగా ఎదగాలని ఉందని చెప్పింది.

ఇవీ చూడండి:ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలు విడుదల

ABOUT THE AUTHOR

...view details