తెలంగాణ

telangana

ETV Bharat / city

పర్యావరణపై అవగాహన కోసం విద్యార్థుల ర్యాలీ - హైదరాబాద్​ అవినాష్​ కాలేజీ విద్యార్థుల ర్యాలీ

జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్​లో అవినాష్​ గ్రూప్​ ఇనిస్టిట్యూట్​ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పెరుగుతున్న కాలుష్యం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ నినాదాలు చేశారు.

student rally
student rally

By

Published : Dec 3, 2021, 10:06 PM IST

జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్​లో అవినాష్​ గ్రూప్​ ఇనిస్టిట్యూట్​ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ బషీర్​బాగ్​ నుంచి ట్యాంక్​బండ్​పై ఉన్న అంబేడ్కర్​ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో నినాదాలు చేశారు. నానాటికి పెరుగుతున్న కాలుష్యంపై ప్రజల్లో అవగాహన మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు.

పర్యావరణ కాలుష్యం మానవ మనుగడకు ప్రమాదకరమని.. ప్రతి ఒక్కరికి కాలుష్యం పట్ల అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కల్ని పరిరక్షిస్తే భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించిన వారమవుతామని పేర్కొన్నారు.

పర్యావరణపై అవగాహన కోసం విద్యార్థుల ర్యాలీ

ఇదీచూడండి:Shilpa Chowdary custody: విచారణలో విలపించిన శిల్ప చౌదరి.. 6 గంటల పాటు ప్రశ్నల వర్షం..

ABOUT THE AUTHOR

...view details