హైదరాబాద్ నెహ్రూజూలాజికల్ పార్క్ లోని సింహాన్నినగరానికి చెందిన ఓ వ్యక్తి దత్తత తీసుకున్నాడు. నగరానికి చెందిన వెంకటేశ్... కుటుంబ సమేతంగా నెహ్రూ జూలాజికల్ పార్కును సందర్శించారు.
సింహాన్ని దత్తత తీసుకున్న నగరవాసి - nehru zoological park lion adoption
రాజకీయ నేతలు ఊర్లను దత్తత తీసుకుంటే... ఓ వ్యక్తి మూగజీవిని దత్తత తీసుకుని తన ఉదారతను చాటుకున్నాడు. నగరానికి చెందిన ఓ వ్యక్తి నెహ్రూ జూలాజికల్ పార్కులోని సింహాన్ని 3 నెలల పాటు దత్తత తీసుకుంటున్నట్లు తెలిపాడు.
![సింహాన్ని దత్తత తీసుకున్న నగరవాసి సింహాన్ని దత్తత తీసుకున్న నగరవాసి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9382487-371-9382487-1604151627009.jpg)
సింహాన్ని దత్తత తీసుకున్న నగరవాసి
అనంతరం పార్కులోని శిరీష అనే ఆఫ్రికన్ సింహాన్ని 3 నెలల పాటు దత్తత తీసుకున్నట్లు ప్రకటించాడు. రూ.25 వేల చెక్కును డిప్యూటీ క్యూరేటర్‌కు వెంకటేశ్ అందజేశాడు.