రాష్ట్రానికి మణిహారం కానున్న ప్రాంతీయ రింగ్‌రోడ్డు దస్త్రం చకచకా కదులుతోంది. జూన్‌లోగా దక్షిణ భాగానికి కూడా భూసేకరణకు అనుమతి లభించనుంది. ఉత్తర భాగానికి చెందిన పూర్తిస్థాయి సవివర నివేదిక (డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) రూపొందించేందుకు కన్సల్టెంట్ నియామకానికి కేంద్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. దక్షిణ భాగానికి జాతీయ రహదారి నంబరును కేటాయించేందుకు అవసరమైన ప్రాథమిక సమాచారం కోసం కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
నివేదిక పంపండి..
హైదరాబాద్ అవుటర్ రింగ్‌రోడ్డుకు 20 కిలోమీటర్ల అవతల 340 కిలోమీటర్ల పొడవునా ప్రాంతీయ రింగ్‌రోడ్డు నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్రం సుముఖత వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. ఈ మార్గం సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల మీదుగా వెళ్తుంది. 158 కిలోమీటర్ల ఉత్తర భాగానికి ఇప్పటికే జాతీయ రహదారి నంబరు వచ్చింది. దక్షిణ భాగానికి నంబరు కేటాయించాల్సి ఉంది.ఆ ప్రక్రియకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. అయిదేళ్ల తరవాత ట్రాఫిక్ ఏస్థాయిలో ఉంటుందో గణాంకాలను రూపొందించి పంపాలని కోరింది.
అదే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన..