పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను సంతోష్ నగర్ పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో జడ్జి ఖాన హాస్పిటల్‌కు చేర్చి మానవత్వాన్ని చాటారు. హైదరాబాద్ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమాల్ బండ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతుంది. ఆమె కుటుంబీకులు 108కి ఫోన్ చేశారు. 108 సిబ్బంది స్పందించ లేదు. దీంతో వారు 100నంబర్‌కు డయల్ చేయగా..... నిమిషాల్లోనే కానిస్టేబుల్ శ్రీకాంత్, సుజిత్ పెట్రోలింగ్ కారులో అక్కడికి చేరుకున్నారు.
గర్భిణిని ఆస్పత్రికి చేర్చి మానవత్వం చాటిన పోలీసులు - సంతోష్ నగర్ పోలీసులు పెట్రోలింగ్ పోలీసులు
హైదరాబాద్ పోలీసులు మరోసారి మానవత్వం చాటారు. పురిటి నొప్పులతో బాధ పడుతున్న ఓ మహిళను సంతోష్ నగర్ పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో సమీప ఆసుపత్రికి చేర్చి ఔదార్యాన్ని చాటారు.
గర్భిణిని ఆస్పత్రికి చేర్చి మానవత్వం చాటిన పోలీసులు
అక్కడి పరిస్థితిని గమనించిన వారు పెట్రోలింగ్ వాహనంలో నయాపూల్ దగ్గర ఉన్న జడ్జి ఖాన ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటారు. ఆ మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:రోడ్లపైకి భారీగా వలస కార్మికులు- పోలీసుల లాఠీఛార్జ్