పోలీసుల బందోబస్త్ మధ్య ఆర్టీసీ బస్సు ప్రయాణం - హైదరాబాద్‌లో పోలీసుల బందోబస్త్ మధ్య ఆర్టీసీ ప్రయాణం
భాజపా కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు... హైదరాబాద్ విద్యానగర్‌లో ప్రయాణికులతో వెళ్తోన్న ఆర్టీసీ బస్సును ఆపేందుకు ప్రయత్నించారు. గమనించిన పోలీసులు 200 మీటర్ల వరకు బందోబస్త్ మధ్య బస్సును ముందుకు తీసుకెళ్లారు.
ఆర్టీసీ బస్సుకు పోలీసుల రక్షణ
హైదరాబాద్ బస్ భవన్ వద్ద భాజపా చేపట్టిన ఆందోళన నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్ నుంచి విద్యానగర్ వైపు రాకపోకలు కొద్దిసేపు నిలిపివేశారు. నాయకుల అరెస్టు అనంతరం ట్రాఫిక్ అనుమతించగా... ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వెళ్తోంది. సమ్మెలో ఉన్న తమను కాదని ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడిపిస్తున్నారని ఆగ్రహించిన కార్మికులు బస్సు ఆపడానికి విశ్వప్రయత్నాలు చేశారు. గమనించిన పోలీసులు నలువైపుల నుంచి 200 మీటర్ల వరకు బందోబస్తు మధ్య బస్సును ముందుకు తీసుకెళ్లారు.
- ఇదీ చూడండి : ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సీఎం సమీక్ష