రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్లో తనిఖీలు మరింత ముమ్మరం చేశారు. నిబంధనలు అతిక్రమించినా, అనవసరంగా రోడ్లమీదికి వచ్చినా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. లిబర్టీలో వాహనాలను తనిఖీల్లో భాగంగా చలాన్లు విధించమే కాకా, పలు వాహనాలను సీజ్ చేశారు. ప్రజలకు తెలిసేలా సీజ్ చేసిన వాహనాల ముందు బోర్డులు పెట్టారు.
వాహనాలు సీజ్ చేశారు.. బోర్డు పెట్టారు.
లాక్డౌన్ అమలులో ఉన్నా భాగ్యనగర వాసులు ఏదో ఒక కారణంతో యథేచ్చగా రోడ్లపైకి వస్తున్నారు. పోలీసులు చాలా మందికి హితబోధ చేసి వెనక్కి పంపుతున్నారు. అయినా ఫలితం లేకపోయేసరికి వాహనాలు సీజ్ చేస్తున్నారు. ప్రజలకు తెలిసేలా సీజ్ చేసిన వాహనాల ముందు బోర్డులు పెట్టారు.
వాహనాలు సీజ్ చేశారు.. బోర్డు పెట్టారు.