తెలంగాణ

telangana

ETV Bharat / city

Actress shalu chourasiya: 'నటి చౌరాసియాపై దాడి కేసులో పోలీసుల అదుపులో అనుమానితులు' - hyderabad crime news

సినీ నటి చౌరాసియాపై దాడి కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతికంగా ముందుకు వెళ్లలేకపోవడంతో.. మిలిగిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 70 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. సినీ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తున్న పాత నేరస్థులను విచారించారు.

Actress shalu chourasiya
Actress shalu chourasiya

By

Published : Nov 19, 2021, 10:38 PM IST

సినీ నటి చౌరాసియాపై దాడి కేసులో (attack on Actress shalu chourasiya) పోలీసులు దాదాపు 70 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీళ్లలో యూసుఫ్​గూడ, కృష్ణానగర్​కు చెందిన 30 మంది పాత నేరస్థులున్నారు. చౌరిసియాపై దాడికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అనుమానితులను ప్రశ్నించారు. అనుమానితుల చరవాణి నంబర్లు సేకరించి.. ఈ నెల 14వ తేదీన రాత్రి 8.30 గంటల సమయంలో ఎక్కడ ఉన్నారనే వివరాలు సేకరించారు. దాడితో సంబంధం లేదని తేలిన తర్వాత అనుమానితులను వదిలేస్తున్నారు.

ఆ ఫోన్​ ఎక్కడ..?

సినీ రంగంలో కార్మికులుగా పనిచేస్తూ (Actress shalu chourasiya case) నేరచరిత్ర ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. సాంకేతిక ఆధారాలు లభించకపోవడంతో పోలీసుల దర్యాప్తులో ఆటంకం ఏర్పడుతోంది. చౌరాసియా ఆపిల్ ఫోన్ ను నిందితుడు ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత చాలా సేపు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే సంచరించాడు. క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలోకి వచ్చిన తర్వాత చరవాణి స్విచ్​ ఆఫ్​ అయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడే ఫోన్​ను ఆఫ్​ చేశాడా..? లేక బ్యాటరీ ఛార్జింగ్​ అయిపోయిందా అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆపిల్ ఫోన్ ఒకసారి లాక్ అయితే దాన్ని తిరిగి అన్​లాక్ చేయాలన్నా.. వేరే సిమ్​ వేయాలన్నా... పాస్​వర్డ్​ తెలిస్తేనే సాధ్యం అవుతుంది. కానీ ఇక్కడ నిందితుడు ఫోన్​ను ఎక్కడైనా పడేశాడా..? లేకపోతే వెంట తీసుకెళ్లి ఇంకెవరికైనా విక్రయించాడా..? అనే కోణంలోనూ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

సీసీ కెమెరాలకు చిక్కలే..

నిందితుడికి సంబంధించి పోలీసులకు ఎలాంటి సాంకేతిక ఆధారాలు లభించకపోవడంతో... శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నారు. కేబీఆర్ పార్కు పరిసరాల్లో 60కి పైగా సీసీ కెమెరాలుంటే... అందులో 10 శాతం మాత్రమే పనిచేస్తున్నాయి. ఆ సీసీ కెమెరాల్లోనూ నిందితుడి దృశ్యాలు ఎక్కడా నమోదు కాలేదు. దీంతో పోలీసులు నిందితుడిని గుర్తించడానికి అష్టకష్టాలు పడుతున్నారు.

గత ఆదివారం (నవంబర్​ 14) రాత్రి 8.30 గంటల సమయంలో కేబీఆర్​ పార్క్​కు వాకింగ్​కు వెళ్లి వస్తుండగా.. సినీనటి చౌరాసియాపై దాడి జరిగింది. ఆమె ఫోన్​ను ఓ ఆంగతకుడు ఎత్తుకెళ్లాడు. తనకు సినీ పరిశ్రమలో ఎవరూ శత్రువులు లేరని.. హైదరాబాద్​ కేబీఆర్​ పార్క్​లో (attack on Actress shalu chourasiya in kbr park)తనను చంపాల్సిన అవసరం కూడా ఎవరికీ లేదని నటి షాలు చౌరాసియా స్పష్టం చేశారు.

లైంగిక దాడికి యత్నించాడు..?

ఆరోజు తాను ధైర్యం చేయకుంటే.. ఆగంతకుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యేదాన్నంటూ (attack on Actress shalu chourasiya in kbr park) చౌరాసియా తెలిపారు. తొలుత తన ఫోన్​ దొంగతనానికి వచ్చినట్లు అనిపించిందని... కానీ తాను స్పృహ కోల్పోయిన.. సమయంలో తనపై లైంగిక దాడి చేసేందుకు ఆగంతకుడు యత్నించినట్లు చౌరాసియా వెల్లడించారు. ఆ క్షణం తాను అప్రమత్తమయ్యానని.. ఆగంతకుడి సెన్సిటివ్​ పార్ట్స్​పై దాడి చేసి తప్పించుకున్నట్లు చెప్పారు. ఆ క్షణం తనను చంపే యత్నం జరిగినట్లు చెప్పారు. దొంగతనానికి వచ్చిన వారికి ఆ ప్రాంతం గురించి అంతా తెలిసినట్లుందని చెప్పిన చౌరాసియా... పూర్తిగా చీకటిగా ఉండడంతో అతని ముఖం చూడలేకపోయానని.. కానీ అతని గొంతును గుర్తుపట్టగలనని చెప్పారు.

ఇవీచూడండి:

ABOUT THE AUTHOR

...view details