తెలంగాణ

telangana

లాక్​డౌన్​ నిబంధనలపై పోలీసు బాస్​ సూచనలు

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్​ కొనసాగుతున్నందున నిత్యావసర వస్తువులు, అత్యవసర విభాగంలోకి వచ్చే వాహనాలకు సంబంధంచి డీజీపీ పలు సూచనలు చేశారు. క్రిములు నశించేందుకు చేతులు ఎలా కడుక్కోవాలో సీపీ అంజనీ కుమార్​ అవగాహన కల్పించారు.

By

Published : Mar 28, 2020, 6:57 AM IST

Published : Mar 28, 2020, 6:57 AM IST

Updated : Mar 28, 2020, 9:53 AM IST

hyderabad  police commissioner anjani kumar advices on lock down
లాక్​డౌన్​ నిబంధనలపై పోలీసు బాస్​ సూచనలు

నిత్యావసర, అత్యవసర విభాగంలోకి వచ్చే వ్యక్తులకు కల్పించిన ప్రత్యేక అనుమతుల్ని దుర్వినియోగం చేయొద్దని... విధులు ముగించుకున్న తర్వాత ఇంటికే పరిమితం కావాలని... లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సరకులు సరఫరా చేసే వాహనదారులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే ఫిర్యాదు చేయొచ్చని సీపీ అంజనీ కుమార్ సూచించారు.

హైదరాబాద్ కమిషనరేట్​కు వచ్చే సందర్శకుల కోసం వాష్ బేసిన్ ఏర్పాటు చేశారు. తనిఖీ చేసిన అనంతరం పక్కనే ఉన్న వాష్ బేసిన్​లో చేతులు కడుక్కునేలా సబ్బు, హ్యాండ్​వాష్​ ఏర్పాటు చేశారు. పర్యవేక్షించేందుకు ఇద్దరు కానిస్టేబుల్స్​ను నియమించారు. ఏ విధంగా శుభ్రం చేసుకుంటే క్రిములు పోతాయో సీపీ అంజనీ కుమార్ వివరించారు. కనీసం 20 సెకన్ల పాటు చేతులు కడుక్కునేలా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.

లాక్​డౌన్​ నిబంధనలపై పోలీసు బాస్​ సూచనలు
Last Updated : Mar 28, 2020, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details