తెలంగాణ

telangana

ETV Bharat / city

బల్దియా పోరు: అడుగడుగు.. భద్రత గొడుగు

బల్దియా పోలింగ్​కు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఓటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తుకు చర్యలు చేపట్టారు.

ecurity-measures-for-ghmc-polling-on-december-first
బల్దియా పోరు: అడుగడుగు.. భద్రత గొడుగు

By

Published : Nov 25, 2020, 10:07 AM IST

బల్దియా ఎన్నికల రోజు ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌ ఉన్నతాధికారులు పోలింగ్‌ కేంద్రాలు, డీఆర్సీ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలను చేపట్టారు. పోలింగ్‌కు రెండురోజుల ముందు జిల్లాల నుంచి అదనంగా అధికారులు, సిబ్బందిని రప్పిస్తున్నారు. వారిని పోలింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తు విధులకు ఉపయోగిస్తారు. విధుల నిర్వహణ తీరుపై అవగాహన కల్పించనున్నారు. ఇక సత్వర చర్యల బృందాలు(ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌), సాయుధ బలగాలు సున్నిత సమస్యాత్మక ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తాయి.

రోజూ పరిశీలన

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోనే ప్రతి జోన్‌లో ఉన్న పోలింగ్‌ కేంద్రాలను ఇన్‌స్పెక్టర్‌ స్థాయి నుంచి డీసీపీ, సంయుక్త కమిషనర్‌ వరకు రోజూ పరిశీలించి లోటుపాట్లను జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారులకు వివరించనున్నారు. పోలింగ్‌ కేంద్రంలో ఇంకా ఎటువంటి సౌకర్యాలు అవసరమో సూచిస్తారు. మంగళవారం సాయంత్రం వరకు 2780 కేంద్రాలను పరిశీలించారు. వాటి సమీపంలో సీసీకెమెరాలుంటే పోలింగ్‌ రోజు ఉపయోగపడేలా సంబంధిత ఠాణాకు అనుసంధానించమంటూ ఆదేశాలు జారీ చేశారు. కెమెరాలు లేని పక్షంలో తాత్కాలికంగా ఏర్పాటుచేయాలని ఎన్నికల అధికారులు పోలీసులకు సూచించారు.

ఎన్నికల బందోబస్తు ఇలా

హైదరాబాద్‌ కమిషనరేట్‌

  • జిల్లాల నుంచి వచ్చే పోలీసులు 3 వేలు
  • పోలీసులు 12 వేలు
  • సమస్యాత్మక ప్రాంతాలు 292
  • సున్నిత ప్రాంతాలు 510
  • సాయుధ బలగాలు 36 ఫ్లటూన్లు
  • సత్వర చర్యల బృందాలు 20 ఫ్లటూన్లు

సైబరాబాద్‌ కమిషనరేట్‌

  • పోలీసులు 13,500
  • సున్నిత ప్రాంతాలు 770
  • రాచకొండ కమిషనరేట్‌
  • పోలీసులు 10 వేలు
  • సున్నిత ప్రాంతాలు 512
  • అత్యంత సున్నిత 53

ABOUT THE AUTHOR

...view details