ఆదివారం సాయంత్ర వేళ భాగ్యనగరవాసులు ట్యాంక్‌బండ్‌పై కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. ప్రతి ఆదివారం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నగరవాసులకు సండే - ఫండే కార్యక్రమం నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు ప్రజలతో సందడిగా మారాయి. ఒక వైపు హుస్సేన్‌సాగర్ అందాలు.. మరోవైపు హైదరాబాద్ రుచులను ఆస్వాధిస్తూ ఆనందంగా గడిపారు. చిన్నా పెద్దా అందరూ కలిసి తమకు ఇష్టమైన, రుచికరమైన వంటకాలను ఆరగించారు. ట్యాంక్ బండ్‌పై ఆట వస్తువులతో పిల్లలు.. ఫోటోలు తీసుకుంటూ పెద్దలూ మురిసిపోయారు. ప్రతి ఆదివారం పిల్లలతో గడిపే విధంగా ఉల్లాస భరితమైన కార్యక్రమాలను ఏర్పాట్లు చేస్తున్నారని భద్రతా పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.