2019లో గ్యాస్ట్రానమీలో యునెస్కో క్రియేటివ్ సిటీస్ జాబితాలో చోటు సంపాదించుకున్న హైదరాబాద్.. ఆ జాబితాకు సంబంధించి దరఖాస్తు చేసుకొనే విషయంలో ఇతర నగరాలకు సహాయ పడుతోంది. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ నిర్వహించిన వెబినార్‌లో హైదరాబాద్ ఒక ఉదాహరణగా నిలిచింది.
యునెస్కో క్రియేటివ్ సిటీస్ వెబినార్‌కు హైదరాబాద్ అధికారులు - హైదరాబాద్ తాజా వార్తలు
గ్యాస్ట్రానమీలో యునెస్కో క్రియేటివ్ సిటీగా 2019లో ఎంపికైన హైదరాబాద్.. ఇతర నగరాలకు ఒక ఉదాహరణగా నిలిచింది. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ నిర్వహించిన వెబినార్‌లో హైదరాబాద్ అధికారులు పాల్గొని.. అవగాహన కల్పించారు.

యునెస్కో క్రియేటివ్ సిటీస్ వెబినార్‌కు హైదరాబాద్ అధికారులు
ఈ జాబితాలో చోటు కోసం దరఖాస్తు సంబంధించి సహాయం కోరుకుంటున్న అమృత్సర్, భోపాల్, గ్వాలియర్, కొలంబో తదితర దక్షిణాసియా నగరాలకు ఈ వెబినార్‌లో హైదరాబాద్ అధికారులు అవగాహన కల్పించారు. ఈ వెబినార్‌లో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్, హైదరాబాద్ క్రియేటివ్ సిటీస్ ప్రతినిధి ప్రావీణ్య పాల్గొన్నారు. గ్యాస్ట్రానమీలో యునెస్కో క్రియేటివ్ సిటీగా ఎంపికైన హైదరాబాద్ గురించి ఈ వెబినార్‌లో వివరించారు.