వివిధ రక్షణాంశాలపై అధ్యయనాలు, పరిశోధనలను ఉమ్మడిగా నిర్వహించడానికి హైదరాబాద్‌లోని ‘నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం’, భారత్‌లోని అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన ‘సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్(సీహెచ్‌ఎస్‌ఎస్)’ల మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. నల్సార్ తరఫున రిజిస్ట్రార్, ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ లా విభాగాధిపతి ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, సీహెచ్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ కన్నెగంటిలు హైదరాబాద్‌లో వీటికి సంబంధించిన ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
నల్సార్, సీహెచ్‌ఎస్‌ఎస్‌ల మధ్య కీలక ఒప్పందం - నల్సార్ సీహెచ్‌ఎస్‌ఎస్
నల్సార్, సీహెచ్‌ఎస్‌ఎస్‌ల మధ్య ఒప్పందం కీలక ఒప్పందం కుదిరింది. రక్షణాంశాలపై, ఉద్రవాద వ్యతిరేక యంత్రాంగం-చట్టాలు తదితరాలపై ఈ రెండు సంస్థలు ఉమ్మడిగా అధ్యయనం, పరిశోధనలు నిర్వహించనున్నాయి.

nalsar university
దేశ అంతర్గత, అంతర్జాతీయ భద్రత, డిఫెన్స్ చట్టాలు, ఆరోగ్య భద్రత-చట్టాలు, సైబర్ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక యంత్రాంగం-చట్టాలు తదితరాలపై ఈ రెండు సంస్థలు ఉమ్మడిగా అధ్యయనం, పరిశోధనలు నిర్వహించనున్నాయి.
ఇదీ చదవండి:కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!