హైదరాబాద్ నగరంలోని మోజంజాహి మార్కెట్ ఈ నెల 15న పునఃప్రారంభించనున్నట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ట్విట్టర్లో వెల్లడించారు. జీహెచ్ఎంసీ నిర్వహణలో ఉన్న ఎంజే మార్కెట్... గతంలో వర్షాలు వస్తే పైనుంచి నీరు కారడం, పై పెచ్చులు ఊడి పడటం, సీలింగ్ దెబ్బతినేవి. శిథిలావస్థలో ఉన్న ఈ అద్భుత నిర్మాణానికి మరమ్మతులు చేసి... సరికొత్త హంగులు అద్దారు.
ఈ నెల 15 నుంచి మోజంజాహి మార్కెట్ పునఃప్రారంభం - mojanjahi market
కరోనా కారణంగా హైదరాబాద్‌లో మూసివేసిన మోజంజాహి మార్కెట్‌ను ఈ నెల 15న ప్రారంభించనున్నట్లు పురపాలక శాఖ ముక్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ తెలిపారు. ఇన్ని రోజులు శిథిలావస్థలో ఉన్న మార్కెట్‌కు సరికొత్త హంగులు అద్దినట్లు వివరించారు.
hyderabad mj market re opens on august 15th onwards
రూ.10 కోట్లతో మోజంజాహీ మార్కెట్ పునరుద్ధరణ పనులు చేశారు. రాత్రి వేళల్లో టూరిజం ప్రియులను ఆకర్షించేందుకు రంగు, రంగుల విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. పైన నుంచి నగరంతో పాటు... మెట్రో రైలు చూస్తు రోజు సాయంత్రం ఇక్కడ సేద తీరేందుకు నగర వాసులు అధిక సంఖ్యలో రానున్నారు. ఈనెల 15 నుంచి అన్ని మార్కెట్లోని అన్ని దుకాణాలు తెరవనున్నట్లు అర్వింద్ కుమార్ పేర్కొన్నారు.