Hyderabad Metro Rush: హైదరాబాద్ మెట్రోల్లో క్రమంగా రద్దీ పెరుగుతోంది. కరోనా కంటే ముందు సుమారుగా 4 లక్షల వరకు ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించేవాళ్లు. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత ఆ సంఖ్య లక్ష నుంచి లక్షన్నరకే పరిమితమైంది. కరోనా సద్దుమణగటంతో.. మెట్రోల్లో ప్రయాణిస్తున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇటీవల ఆ సంఖ్య కరోనా కంటే ముందులా.. 4 లక్షలకు చేరుకుంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య 5 లక్షలకు పెరిగే అవకాశముందని మెట్రో అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగినట్టుగా.. మెట్రో సర్వీసుల సంఖ్య పెంచేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
మెట్రోకు పెరుగుతోన్న ఆదరణ, రోజుకు 4 లక్షల మంది ప్రయాణం - 4 లక్షలకు చేరిన ప్రయాణికుల సంఖ్య
Hyderabad Metro Rush హైదరాబాద్ మెట్రోల్లో పూర్వవైభవం కనిపిస్తోంది. మెట్రోల్లో ప్రయాణిస్తోన్న ప్రయాణికుల సంఖ్య 4 లక్షలకు పెరగటమే అందుకు నిదర్శనం. మెట్రో స్టేషన్లలో కరోనాకు ముందు కనిపించిన రద్దీ మళ్లీ దర్శనమిస్తోంది.

కరోనా కారణంగా.. ఇంటి నుంచి విధులు నిర్వహించిన ఉద్యోగులు మళ్లీ ఆఫీసుల బాట పట్టటం వల్ల నగరంలో ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. ట్రాఫిక్ నుంచి తప్పించుకునేందుకు చాలా మంది ఉద్యోగులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. నగరంలోని ట్రాఫిక్కు వర్షాలు కూడా తోడవటంతో.. ప్రజలు మెట్రోవైపే మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా మెట్రోకు మునుపటి ఆదరణ దక్కుతోంది. మరోవైపు.. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు మెట్రో యాజమాన్యం సూపర్ సేవర్ కార్డు కూడా.. ప్రవేశపెట్డడంతో సెలవు రోజుల్లో మరింత ఆదరణ కనిపిస్తోంది. రెండో శనివారాలు, సెలవుదినాల్లో ఈ సూపర్ సేవర్ కార్డుదారుల రద్దీ కూడా కొనసాగుతుండటంతో.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా తగిన సౌకర్యాలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: