హైటెక్ సిటీ - రాయదుర్గం మెట్రో రైల్ స్ట్రెచ్ పనులను మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు. ఈ నెల 29న ఈ కారిడార్‌ను మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో రైలు ఇంజినీర్లు, ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ కారిడార్‌లో కొద్దిరోజుల క్రితమే ట్రాయల్ రన్స్ పూర్తయ్యాయి.
రాయదుర్గం మెట్రోస్టేషన్‌ను పరిశీలించిన మెట్రో ఎండీ - రాయదుర్గం మెట్రోస్టేషన్
రాయదుర్గం మెట్రోస్టేషన్‌ను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు. ఈ నెల 29న రాయదుర్గం మెట్రోస్టేషన్ ప్రారంభం కానుంది.
raidurg metro station
ఈ నెల 27, 28 తేదీలో మెట్రో రైలు భద్రత ఉన్నతాధికారులు ఈ కారిడార్‌ను మరోసారి పరిశీలించనున్నారు. కిలో మీటరున్నర ఉన్న ఈ కారిడార్ ప్రారంభమైతే ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. మెట్రోకు కూడా మరో 40 వేల మంది ప్రయాణికులు పెరిగే అవకాశం ఉందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: జంట నగరాల్లో మెట్రోకు పెరిగిన ఆదరణ