ఓఆర్‌ఆర్‌పై వాహనాలు ఎక్కడా నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ‘ఫాస్టాగ్’ (నగదు రహిత) సేవలకు ఏడాదిన్నర కిందట శ్రీకారం చుట్టారు. అన్ని ఇంటర్‌ఛేంజ్‌ల దగ్గర ప్రత్యేకంగా ఈటీసీ (ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్) లేన్లను అందుబాటులోకి తెచ్చారు. వాహనాల అద్దాలపై ఉండే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) ట్యాగ్‌ల బార్‌కోడ్‌ను యంత్రం స్కాన్ చేస్తుంది గేట్లు వాటంతట అవే తెరుచుకుంటాయి. ఎంతదూరం ప్రయాణించారో లెక్కించి అంతే మొత్తం ఖాతా నుంచి కట్ అవుతుంది.
నగదు రహితం... ఫాస్టాగ్‌తో జరిమానా అ'ధనం'! - HMDA is collecting toll on outer ring road in Hyderabad
ఐదు రోజుల కిందట ఓ వాహనదారుడు కారులో గచ్చిబౌలి దగ్గర ఓఆర్‌ఆర్ ఎక్కి తొండుపల్లి జంక్షన్ దగ్గర దిగారు. ‘ఫాస్టాగ్’ ఉండటంతో నిరీక్షణ తప్పిందంటూ ఊపిరి పీల్చుకున్నాడు. తీరా ఫోన్‌కొచ్చిన ఎస్‌ఎంఎస్‌ను చూసి కంగుతిన్నాడు. టోల్ రుసుం రూ.40కి బదులుగా రూ.70 ఖాతా నుంచి డెబిట్ అయింది. ఇదే అనుభవం ప్రతిరోజు ఎంతోమందికి ఎదురవుతోంది.
ఫాస్టాగ్ సేవలు మొదలైనప్పటి నుంచి సాంకేతిక సమస్యలు వాహనదారులను వెంటాడుతూనే ఉన్నాయి. స్కానర్లు తరచూ మొరాయిస్తూ ముప్పు తిప్పలు పెడుతున్నాయి. వాహనాలు బారులు తీరుతుండటంతో సిబ్బంది మ్యానువల్‌గా గేట్లు తెరుస్తున్నారు. వాహనదారులు స్కాన్ అయి ఉంటుందని భావించి ముందుకెళ్తున్నారు.
తీరా చూస్తే దిగేటప్పుడు గట్టి షాక్ తగులుతుంది. అప్ ర్యాంప్ దగ్గర స్కాన్ చేయించుకోలేదంటూ టోల్ ఛార్జీలతోపాటు జరిమానాగా అదనంగా మరో రూ.30 వసూలు చేస్తున్నారు. ఒకే వాహనానికి రెండుసార్లు టోల్ తీస్తున్నారు. స్కానర్లు పనిచేయనప్పుడు ప్రత్యేక గన్‌తో ఫాస్టాగ్‌ను స్కాన్ చేయాలి. కానీ అందుకు చాలా సమయం పడుతుండటంతో కొందరు అసలు ఫాస్టాగ్‌నే తీసేసి అధిక టోల్ కట్టాడానికైనా సిద్ధమవుతున్నారు.
TAGGED:
ఫాస్టాగ్‌తో అధనం!