తెలంగాణ

telangana

Shortage of City Buses : ఉదయం 8 అయితే చాలు.. భాగ్యనగర ప్రజలకు నరకమే!

By

Published : Oct 23, 2021, 9:16 AM IST

భాగ్యనగరంలో ఉదయం 8 అయిందంటే చాలు బస్టాపులన్ని సందడి మారుతున్నాయి. దాదాపు 2 ఏళ్ల తర్వాత బస్సుల(Shortage of City Buses)న్ని కిటకిటలాడుతున్నాయి. కరోనా వల్ల కొన్ని బస్సుల సర్వీసులను నిలిపివేసిన అధికారులు.. ప్రస్తుతం వాటిలో కొన్నింటినే పునరుద్ధరించారు. దీనివల్ల ఉదయం కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. బస్సులో కాలు పెట్టడానికి కూడా చోటులేని స్థితిలోనూ ఫుట్​బోర్డుకు వేలాడుతూ ప్రమాదకరంగా వెెళ్తున్నారు. మరో బస్సు(Shortage of City Buses) కోసం వేచిచూసే సమయం లేక.. ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే స్తోమత సరిపోక ప్రాణాలు పణంగా పెట్టి పయనిస్తున్నారు.

Shortage of City Buses
Shortage of City Buses

ఉదయం 8 నుంచి 11 గంటలు.. సాయంత్రం 4 నుంచి 7 గంటలు.. ఇలా మొత్తమ్మీద ఆరు గంటలు భాగ్యనగర ప్రయాణికులు నరకం చూస్తున్నారు. బస్సులో(Shortage of City Buses) కూర్చోవడానికి సీటు కాదు కదా.. నిల్చునే అవకాశం కూడా ఉండదు. ఇంతగా నిండిపోయే బస్సులోకే ప్రతి బస్టాపులో మరో పది మంది తోడవుతుంటారు. వీరంతా వేలాడుతూ ప్రయాణాలు సాగించాల్సిందే. ఈ తిప్పలన్నీ ఎందుకనుకునేవారు ప్రైవేటు వాహనాలు, క్యాబ్‌లు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. మోస్తరు జీతంతో ఉద్యోగం చేసిన వారు ఇలా వెళ్లిపోతుంటే.. ఇక సామాన్యులు మాత్రం బస్సు దొరక్క నడిరోడ్డుపై, బస్సు ఎక్కాక అందులోనూ నరకం అనుభవిస్తున్నారు. వీరికి విద్యార్థులు తోడైతే.. పుస్తకాల బ్యాగులతో వేలాడుతూ కనిపిస్తున్న దృశ్యాలు అందరినీ భయానికి గురి చేస్తాయి. ఏమాత్రం పట్టు తప్పినా ప్రాణాలకు ముప్పు వాటిల్లే రీతిలో ప్రయాణాలు నగరంలో, శివార్లలో సాగుతున్నాయి.

లెక్కల ప్రకారమే 8 లక్షలమంది..

గ్రేటర్‌ పరిధిలో విద్యార్థుల బస్సు పాస్‌లు 6.50 లక్షలుండగా.. మరో నాలుగైదు లక్షల మంది టికెట్లతో వెళ్తున్నారు. నగరంలో తిరిగే బస్సులు 2750 బస్సులు. ఒక్కో బస్సులో(Shortage of City Buses) 45 మంది కూర్చోవచ్ఛు మరో 20 మంది నిల్చున్నా పెద్ద ఇబ్బంది ఉండదు. ఏకంగా 70 నుంచి 80 మంది ప్రయాణిస్తుండటంతో తీవ్ర అవస్థలు తప్పడం లేదు. ఒక్కో బస్సులో 80 మంది చొప్పున 2.20 లక్షల మంది మాత్రమే ఒకసారి వెళ్లగలరు. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య ప్రయాణించేవారు ఆర్టీసీ లెక్కల ప్రకారమే 8 లక్షల మంది. సాయంత్రం కూడా ఇంతే మంది ఉంటారు. ఇక రోజంతా కలిపి 29 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.

తగ్గిన ప్రజా రవాణా

3750 బస్సులతో(Shortage of City Buses)నే నగరంలో దశాబ్దంపాటు నెట్టుకొచ్చిన ఆర్టీసీ గతేడాది వెయ్యి బస్సులకు కోత విధించింది. ఇన్నాళ్లూ కరోనా ప్రభావంతో బస్సుల లోటు కనిపించలేదు. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు అన్నీ నడుస్తుండడంతో ఉదయం, సాయంత్రం బస్టాపులు కిటకిటలాడుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details