హైదరాబాద్‌లో మరో కారిడార్‌లో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. రెండు నెలలుగా ట్రాయల్ నిర్వహిస్తున్న జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు రెండో కారిడార్‌కు ఇవాళ తుది అనుమతులు లభించాయి. ఈ కారిడార్‌లో ఇవాళ 18 రకాల భద్రత తనిఖీలను మెట్రో రైలు భద్రత కమిషనర్ జేకే గార్గ్ నిర్వహించారు. ఆయనతో పాటు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీనియర్ ఇంజినీరింగ్ అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు.
భాగ్యనగరం సిగలో మరో "మెట్రో" కారిడార్!
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు కారిడార్‌కు తుది అనుమతులు లభించాయి. ఈ మార్గంలో 18 రకాల భద్రత తనిఖీలు పూర్తి చేసి.. మెట్రో రైలు భద్రత కమిషనర్ జేకే గార్గ్ క్లియరెన్స్ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయం అనంతరం ప్రజలకు అందుబాటులోకి రానుంది.
metro
విద్యుత్, అగ్నిమాపక, భద్రత, లిఫ్ట్స్, ఎస్కలెటర్లు, ట్రాకులను అధికారులు తనిఖీ చేశారు. అనంతరం మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి తుది అనుమతుల పత్రాన్ని మెట్రో రైలు భద్రత కమిషనర్ జేకే గార్గ్ అందించారు. ప్రభుత్వ నిర్ణయం అనంతరం ప్రజలకు ఈ కారిడార్ అందుబాటులోకి రానుంది.
ఇదీ చూడండి: సమీక్ష: యుద్ధం-కష్టం, అబద్ధం-నిజం.. ఓ వైకుంఠపురం
Last Updated : Jan 12, 2020, 4:49 PM IST