రాష్ట్ర ప్రజలకు అత్యవసర సమయాల్లో మేమున్నామంటూ ఆత్మస్థైర్యాన్ని నింపామని రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ అన్నారు. అగ్నిప్రమాదాలు, వరదలు, కరోనా ఆపత్కాలంలో తెలంగాణ ప్రజలను ఆదుకున్నామని తెలిపారు. తెరాస పార్టీ ప్రజలకోసం అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ అండగా ఉంటుందని, వారి అభివృద్ధికి కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
'దేశంలో విపత్తు నిర్వహణ దళం ఉన్న ఏకైక నగరం.. భాగ్యనగరం' - trs campaign in ghmc elections
దేశంలో.. శిక్షణ పొందిన విపత్తు నిర్వహణ దళం ఉన్న ఏకైక నగరం హైదరాబాద్ అని పురపాలక మంత్రి కేటీఆర్ అన్నారు. సురక్షిత భాగ్యనగరం కావాలంటే.. డిసెంబర్ 1న తెరాసకు ఓటు వేయాలని ట్విటర్ వేదికగా కోరారు.
దేశంలో విపత్తు నిర్వహణ దళం ఉన్న ఏకైక నగరం.. భాగ్యనగరం
దేశంలో శిక్షణ పొందిన విపత్తు నిర్వహణ దళం ఉన్న ఏకైక నగరం భాగ్యనగరమని కేటీఆర్ అన్నారు. అత్యవసర సమయాల్లో విపత్తు నిర్వహణ బృందాలు తమ అత్యుత్తమ సేవలందించాయని కొనియాడారు. భాగ్యనగర అభివృద్ధి, భద్రత ఇలాగే కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ కోరారు.