తెలంగాణ రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల మూడు రోజుల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
గురు, శుక్రవారాల్లో తెలంగాణలో భారీ వర్షాలు - తెలంగాణలో వర్షాలపై ఐఎండీ హైదరాబాద్ నివేదిక
రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం నివేదిక ఇచ్చింది. గురు, శుక్రవారాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. ఏపీ తీరానికి దగ్గరగా ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 13న అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వెల్లడించింది.
గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సుమారుగా సెప్టెంబరు 13న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావారణ కేంద్రం సంచాలకులు వివరించారు. ఏపీ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 కి.మీ ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని హైదరాబాద్ ఐఎండీ వివరించింది.
ఇదీ చదవండి:ఇకనుంచి తహసీల్దార్లే జాయింట్ రిజిస్ట్రార్‌లు: కేసీఆర్