గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఘనతను సాధించారు. మొట్టమొదటి సారిగా కరోనా పాజిటివ్ ఉన్న గర్భిణికి శస్త్ర చికిత్స ద్వారా కాన్పు చేశారు. 22 ఏళ్ల కరోనా సోకిన మహిళ... గాంధీలో చికిత్స పొందుతోంది. మరోవైపు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతోందని వైద్యులు తెలిపారు. మహిళకు శస్త్ర చికిత్స చేయగా.. మగబిడ్డ జన్మించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని... చిన్నారిని వేరుగా ఉంచినట్టు వివరించారు. చిన్నారి స్వాబ్ సేకరించి.. పరీక్షల కోసం పంపినట్టు వెల్లడించారు. వైద్యుల ఘనతను మంత్రి ఈటల అభినందించారు.
కరోనా సోకిన గర్భిణికి గాంధీ ఆస్పత్రిలో కాన్పు - corona updates in hyderabad
కరోనా సోకిన గర్భిణికి గాంధీ ఆస్పత్రిలో కాన్పు
18:18 May 08
కరోనా సోకిన గర్భిణికి గాంధీ ఆస్పత్రిలో కాన్పు
Last Updated : May 8, 2020, 11:45 PM IST