తెలంగాణ

telangana

ETV Bharat / city

హడావుడిగా పాక్​లో ల్యాండైన హైదరాబాద్‌ విమానం

Flight landed in Karachi హైదరాబాద్ నుంచి పన్నెండు మంది ప్రయాణికులతో బయలుదేరిన ఒక అద్దె విమానం పాకిస్థాన్​లోని కరాచీ విమానాశ్రయంలో దిగింది. దీనికి కారణాలేంటన్నది స్పష్టంకాలేదని పాక్‌ వర్గాలు తెలిపాయి.

flight
flight

By

Published : Aug 16, 2022, 7:59 AM IST

Flight landed in Karachi: పన్నెండు మంది ప్రయాణికులతో హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన ఒక అద్దె విమానం పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో దిగింది. దీనికి కారణాలేంటన్నది స్పష్టంకాలేదని పాక్‌ వర్గాలు తెలిపాయి. వీరి కథనం ప్రకారం ఈ ప్రత్యేక విమానం హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం బయలుదేరింది. మధ్యాహ్నం 12.10 గంటలకు కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో దిగింది. కొద్దిసేపటికి మళ్లీ అది 12 మంది ప్రయాణికులతో అక్కడి నుంచి బయలుదేరింది. గత నెలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భారత్‌కు చెందిన రెండు విమానాలు కరాచీలో దిగాయి.

ABOUT THE AUTHOR

...view details