- టోలిచౌకి సెక్షన్ పరిధిలోని నదీమ్ కాలనీలో 100ఎంఎం, 150ఎంఎం డయా వాటర్ పైపులైన్‌కు రూ.98 వేలతో మరమ్మతులు చేసినట్లు పని చూపించారు. ఈ పనులు 2008లో జరిగినట్లు అందులో పేర్కొన్నారు. ఈ బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పనులు జరిగినట్లు వివరాలు అందుబాటులో లేవు.
- హకీంపేట రోడ్డులో 2009లో రూ.80 వేలతో జంక్షన్ పనులు చేసినట్లు బిల్లులు పెట్టారు. ఈ బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. అసలు పనిచేశారో...లేదంటే తప్పుడు ఎస్టిమేట్లు తయారు చేశారో గుర్తించలేకపోతున్నారు.
ఇలా...ఒకటి కాదు..రెండు కాదు... భాగ్యనగర వ్యాప్తంగా 3 వేల పనులకు సంబంధించిన బిల్లుల్లో మాయాజాలం చోటుచేసుకుంది. అసలు ఆ పనులు జరిగాయో లేవో కూడా అధికారులు తేల్చుకోలేక పోతున్నారు. వీటికి సంబంధించి రూ.9 కోట్ల విలువైన బిల్లులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. ఆయా మొత్తాలను విడుదల చేయాలని గుత్తేదారులు పదేపదే అధికారులను కోరుతుండటంతో ఎట్టకేలకు వీటి నిగ్గు తేల్చేందుకు విజిలెన్సు రంగంలోకి దిగింది. చాలా పనులకు సంబంధించి పేపర్లపై లెక్కలు తప్ఫ...స్థానికంగా పనులు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించడం లేదని సమాచారం. వాస్తవానికి పని చేసిన నెల, రెండు నెలల్లో బిల్లులు మంజూరు చేస్తుంటారు.