తెలంగాణ

telangana

ETV Bharat / city

శిశువిహార్​ను సందర్శించిన సీపీ.. వీణా-వాణీలతో ముచ్చట్లు - shika goyal at sishuvihar children's day celebrations

బాలల దినోత్సవం సందర్భంగా వెంగళ్​రావు నగర్​లోని శిశువిహార్​ను హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ సందర్శించారు. అక్కడుంటున్న వీణా-వాణీలతో కేక్​ కట్​ చేయించారు. చిన్నారులతో వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషాన్నించిందని అంజనీకుమార్​ అన్నారు.

శిశువిహార్​ను సందర్శించిన సీపీ.. వీణా-వాణీలతో ముచ్చట్లు

By

Published : Nov 14, 2019, 11:20 PM IST

చిన్నారుల మధ్యలో బాలల దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ అన్నారు. వెంగళ్​రావునగర్​లోని శిశువిహార్​ను అదనపు సీపీ షికాగోయల్​, సంయుక్త సీపీ తరుణ్​జోషితో కలిసి ఆయన సందర్శించారు.

శిశువిహార్​లో ఉంటున్న వీణా వాణీలతో సీపీ ప్రత్యేకంగా మాట్లాడారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వారితో కేక్​ కట్​ చేయించారు. అనంతరం చిన్నారులందరికి పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. శిశువిహార్​ నిర్వాహకులను అభినందించారు.

శిశువిహార్​ను సందర్శించిన సీపీ.. వీణా-వాణీలతో ముచ్చట్లు

ఇవీచూడండి: పిల్లలుంటే ఇలా చేయండని చెబుతోన్న నాని

ABOUT THE AUTHOR

...view details