ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్నందున నగరంలోని పరిస్థితులు, వివిధ అంశాలపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్... దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు. నగరంలోని సీసీ టీవీల పనితీరు, రౌడీషీటర్ల కదలికలు, పీడీ యాక్టుల నమోదు, జీరో ఎఫ్ఐఆర్ వంటి అంశాలపై చర్చించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా నగరంలో పరిస్థితులపై సీపీ సమీక్ష - సీపీ అంజనీ కుమార్ వీడియో కాన్ఫరెన్స్
నగరంలో పరిస్థితులపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు. సీసీఎస్, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్, ఇంటెలిజెన్స్, శాంతిభద్రతల విభాగాల ఉన్నతాధికారులతో చర్చించారు.
![ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా నగరంలో పరిస్థితులపై సీపీ సమీక్ష hyderabad cp anjani kumar video conference on city situations due to mlc elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10709617-thumbnail-3x2-cp.jpg)
ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా నగరంలో పరిస్థితులపై సీపీ సమీక్ష
శబ్ధ కాలుష్యంపై కూడా ట్రాఫిక్ అధికారులతో సీపీ సమీక్షించారు. దృశ్య మాధ్యమ సమీక్ష సమావేశంలో సీపీతోపాటు, సీసీఎస్, ట్రాఫిక్, టాస్క్‌పోర్స్, ఇంటెలిజెన్స్, శాంతిభద్రత విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం