బోయిన్‌పల్లి అపహరణ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. కేసులోని మిగిలిన నిందితులందరినీ ఒకట్రెండు రోజుల్లో పట్టుకుంటామని... పోలీసు కస్టడీలో ఉన్న ప్రధాన నిందితురాలు మాజీ మంత్రి అఖిలప్రియను సీనియర్ అధికారులు విచారిస్తున్నారని ఆయన చెప్పారు.
'బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో సాంకేతిక ఆధారాలు సేకరించాం' - telangana varthalu
బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో సాంకేతిక ఆధారాలు సేకరించామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. మిగిలిన నిందితులను త్వరలో పట్టుకుంటామని ఆయన వెల్లడించారు.
'బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో సాంకేతిక ఆధారాలు సేకరించాం'
రేపు మధ్యాహ్నంతో అఖిలప్రియ కస్టడీ ముగుస్తుందన్న ఆయన.... అనంతరం తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలిస్తామని వివరించారు. నిందితులు చెప్పిన అంశాలను క్రోడీకరించి కోర్టుకు సమ్పర్పిస్తామని చెప్పారు. అపహరణ కేసులో సాంకేతిక ఆధారాలు ఇప్పటికే సేకరించినట్లు అంజనీకుమార్ వెల్లడించారు.
ఇదీ చదవండి: కిడ్నాప్ కేసులో మూడో రోజు అఖిలప్రియ విచారణ
Last Updated : Jan 13, 2021, 3:03 PM IST