తెలంగాణ

telangana

ETV Bharat / city

రూ.కోటి హవాలా డబ్బు పట్టివేత.. ఆ పార్టీ నేతదేనట..! - one core Rupees Seized Hawala Money in Hyderabad

దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ హైదరాబాద్‌ నుంచి తరలిస్తున్న కోటి రూపాయల హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుబ్బాక భాజపా అభ్యర్థి రఘునందన్ రావు బావమరిది సురభి శ్రీనివాస్‌రావు డబ్బు తరలిస్తుండగా పట్టుకున్నట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ పేర్కొన్నారు.

Hyderabad CP Anjani Kumar Seized Hawala Money in Hyderabad
హైదరాబాద్‌లో రూ.కోటి హవాలా డబ్బు పట్టివేత

By

Published : Nov 1, 2020, 4:40 PM IST

Updated : Nov 1, 2020, 8:02 PM IST

దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం ముగిసిన క్రమంలో.. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. హైదరాబాద్‌ నుంచి హవాలా మార్గంలో డబ్బులు దుబ్బాక వెళ్తున్నాయన్న సమాచారంతో ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ నార్త్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, బేగంపేట పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. వీరిలో దుబ్బాక భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు బావమరిది సురభి శ్రీనివాసరావు, డ్రైవర్‌ రవికుమార్‌ ఉన్నట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. వారి నుంచి కోటి రూపాయల నగదు... కారు, రెండు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. బేగంపేటలోని పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్‌కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్‌ కార్యాలయం నుంచి నగదు తెచ్చినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని వివరించారు.

సజావుగా జరిపిస్తాం

ఇటీవల చాలా కేసుల్లో నగదు భారీగా దొరికినట్లు హైదరాబాద్‌ సీపీ వెల్లడించారు. మహంకాళి, నారాయణగూడ, సుల్తాన్‌బజార్‌ పీఎస్‌ పరిధులు సహా వివిధ చోట్ల నగదు పట్టుకున్నట్లు వెల్లడించారు. ఎలాంటి ప్రలోభాలు లేకుండా దుబ్బాక ఉపఎన్నికలు జరిగేందుకు పోలీసుశాఖ తమవంతు పాత్ర పోషిస్తుందని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో భారీగా హవాలా డబ్బు పట్టివేత

ఇవీచూడండి:'కేంద్రానికి వెళ్తున్న పన్నుల్లో సగం మాత్రమే రాష్ట్రానికి వస్తున్నాయి'

Last Updated : Nov 1, 2020, 8:02 PM IST

ABOUT THE AUTHOR

...view details