దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని... ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ సూచించారు. ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడకుండా ఉండాలని.... కుటుంబ సభ్యులు, తోటివారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన విధంగా వ్యహరించాలని అంజనీ కుమార్ కోరారు.
'ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి... కరోనాను దరిచేరనీయకండి' - city police awareness on mask
హైదరాబాద్లోని బషీర్బాగ్ కూడలి వద్ద సీపీ అంజనీ కుమార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు... మాస్క్ వినియోగంపై వాహనదారులకు అవగాహన కల్పించారు. కుటుంబ సభ్యులు, తోటివారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన విధంగా వ్యహరించాలని అంజనీ కుమార్ కోరారు.
awareness on wearing face mask
హైదరాబాద్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రాబోయే వారం రోజుల పాటు మాస్క్ తప్పనిసరిపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. బషీర్బాగ్ కూడలి వద్ద సీపీ అంజనీ కుమార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు కలిసి మాస్క్ వినియోగంపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రజారోగ్యం కోసం ప్రభత్వం 4 రోజుల క్రితం రెండు జీవోలను విడుదల చేసిందని... దాని ప్రకారం ప్రజలు నడుచుకోవాలని సీపీ వివరించారు.