ఒకేరోజు 92 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేశారని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇదంతా తప్పుడు ప్రచారమని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ కొట్టిపారేశారు.
పోలీసుల సస్పెన్షన్ అంటూ పోస్టులు.. ఖండించిన సీపీ - False propaganda on Telangana police
పోలీసు అధికారుల సస్పెన్షన్ అంటూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని హైదరాబాద్ సీపీ తెలిపారు. ఒకేరోజు 92 మంది అధికారులను తొలగించారనే సోషల్ మీడియా పోస్టులను ఖండించారు.

92 మంది పోలీసుల సస్పెండ్ అంటూ పోస్టులు
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థులకు సహకరించిన పోలీసులపై చర్యలంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.