హైదరాబాద్‌లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అబిడ్స్ బొగ్గుల కుంటలోని వెస్లీ చర్చిలో క్రైస్తవులు ఉత్సాహంగా సంబురాలు చేసుకుంటున్నారు. సామూహిక ప్రార్థనలు... ఏసు గీతాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. పాస్టర్లు, బిషప్‌లు ఏసు బోధనలను ప్రవచించారు.
వెస్లీ చర్చిలో సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్న సీపీ అంజనీకుమార్ - hyderabad cp anjani kumar at wesley church in abids
భాగ్యనగరంలో క్రిస్మస్ వేడుకలు కన్నులపండువగా జరుగుతున్నాయి. అబిడ్స్ బొగ్గుల కుంటలోని వెస్లీ చర్చిలో జరిగిన సామూహిక ప్రార్థనల్లో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు.
వెస్లీ చర్చిలో సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్న సీపీ అంజనీకుమార్
ఏసు జన్మ వృత్తాంతాన్ని వివరించారు. ప్రార్థనలు, భక్తి గీతాల ఆలాపన మధ్య క్రిస్మస్ వేడుకలు సందడిగా సాగుతున్నాయి. హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ప్రార్థనల్లో పాల్గొన్నారు.
- ఇదీ చూడండి :క్రిస్మస్ వేడుకల్లో 'మెగా' కజిన్స్