'ఉజ్జయినీ బోనాలకు భారీ భద్రత' - mahankali bonalu festival at hyderabad
తెల్లవారు జామునే ప్రారంభమైన ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగకు పోలీస్ శాఖ భారీ భద్రత ఏర్పాటు చేసింది. సుమారు 2వేల మందితో భద్రత ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు.
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నాందేడ్, ఆంధ్రప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని నగర సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఇప్పటికే అమ్మవారిని 50వేల మంది భక్తులు దర్శించుకున్నారని వెల్లడించారు. ఈరోజు మరో 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. వీఐపీలు వచ్చినా... భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. మహంకాళి పోలీసు స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, బారికేడ్లు ఏర్పాటు చేశామని భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ప్రశాంతంగా అమ్మవారికి బోనాలు సమర్పించుకోవాలని కోరారు.
- ఇదీ చూడండి : మహంకాళికి బోనం సమర్పించిన కిషన్ రెడ్డి దంపతులు