తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఒక్క సీసీ కెమెరా.. వంద మంది కానిస్టేబుళ్లతో సమానం'

హైదరాబాద్​లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో సీపీ అంజనీకుమార్‌ 250 సీసీ కెమెరాలను ప్రారంభించారు. నగరంలో ఇప్పటికే 3 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయని... మరిన్ని ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఒక్క కెమెరా వంద మంది కానిస్టేబుళ్లతో సమానమన్నారు.

By

Published : Apr 30, 2021, 4:15 PM IST

hyderabad cp anjani kumar about cc cameras Importance
hyderabad cp anjani kumar about cc cameras Importance

సీసీ కెమెరాల ద్వారా నేరాల ఛేదన వేగవంతమైందని హైదరాబాద్​ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ స్పష్టం చేశారు. ఎటువంటి నేరం జరిగినా... 24 గంటల్లో నేరగాళ్లను పట్టుకుంటున్నామని వివరించారు. నగరంలో ఇప్పటికే 3 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయని... మరిన్ని ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఒక్క కెమెరా వంద మంది కానిస్టేబుళ్లతో సమానమన్నారు.

కొవిడ్‌ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలని... విధిగా మాస్కు ధరించి శానిటైజర్‌ వాడాలని అంజనీకుమార్​ సూచించారు. ఆర్టీసీ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో అంజనీకుమార్‌ 250 సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ అదనపు కమిషనర్ అనిల్‌కుమార్‌, మధ్య మండలం డీసీపీ విశ్వప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కరోనాపై భయాలొద్దు.. ఇవి తెలుసుకోండి

ABOUT THE AUTHOR

...view details