Consumer Court Fires on Qatar Airways : ఛార్జీలు వసూలు చేసి సదుపాయాలు కల్పించని ఖతార్ ఎయిర్‌వేస్ తీరుపై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-1 ఆగ్రహం వ్యక్తం చేసింది. వినియోగదారుల అదనపు ఖర్చులకు కారణమైనందుకు రూ.9,300, 9 శాతం వడ్డీతో తిరిగి చెల్లించడంతో పాటు, మానసిక వేదనకు పరిహారంగా రూ.25వేలు, కేసు ఖర్చులు రూ.5వేలు చెల్లించాలని ఆదేశించింది.
ఖతార్ ఎయిర్‌వేస్‌పై వినియోగదారుల కమిషన్ ఫైర్ - ఖతార్ ఎయిర్‌వేస్‌పై వినియోగదారుల కోర్టు ఆగ్రహం
Consumer Court Fires on Qatar Airways : ఖతార్ ఎయిర్‌వేస్ తీరుపై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ మండిపడింది. వినియోగదారులకు అదనపు ఖర్చలయ్యేలా కారణమవ్వడమే గాక... వారు మానసికంగా వేదనకు గురయ్యేలా చేసినందుకు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
Penalty to Qatar Airways : హైదరాబాద్‌లోని కొండాపూర్‌కు చెందిన ఎస్.రేణుక, తన భర్త డి.రామకృష్ణతో కలిసి దోహా మీదుగా అమెరికాకు వెళ్లేందుకు టిక్కెట్లు బుక్ చేయమని ప్రతివాద సంస్థను ఆశ్రయించారు. రేణుక మోకాలి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉందని, తన భర్త గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని తెలిపి అనువుగా ఉండే బల్క్‌హెడ్ సీట్‌లు ఉండేలా చూడాలని కోరారు. 6న హైదరాబాద్ నుంచి దోహా వెళ్లే విమానంలోకి ఎక్కిన తర్వాత బల్క్‌హెడ్ సీట్లకు బదులు మధ్యలో ఉండే మరో సీట్లను కేటాయించడంతో అవాక్కవడం ఫిర్యాదీదారుల వంతైంది.
Qatar Airways News : ఈ నేపథ్యంలో తీవ్ర నొప్పి, వాపులతో ఇరువురు ఇబ్బంది పడ్డారు. అనుకున్న సమయానికి భారత్ తిరిగి రాలేదని మరో విమానం కోసం అదనంగా రూ.9,300 వెచ్చించాల్సి వచ్చిందని తెలిపారు. విచారించిన జిల్లా కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమా వెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు రామ్‌మోహన్‌తో కూడిన బెంచ్ ఫిర్యాదీ వాదనలతో ఏకీభవించింది. అదనంగా చెల్లించిన డబ్బు వడ్డీతో పాటు చెల్లించడంతో పాటు పరిహారం, కేసు ఖర్చులు 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది.