సచివాలయం ప్రాంగణంలో మసీదులు, ఆలయాన్ని కూల్చివేయడం సైఫాబాద్ పోలీసులకు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. కూల్చివేతకు బాధ్యత వహిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ మహమ్మద్ సలీం, ఇతరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం 150 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదులను పోలీసులకు అందజేశారు.
'ప్రార్థనా మందిరాలు కూల్చివేయడంపై కాంగ్రెస్ ఫిర్యాదు' - అంజన్ కుమార్ యాదవ్ వార్తలు
సచివాలయం ప్రాంగణంలో మసీదులు, ఆలయాన్ని కూల్చివేయడంపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. మొత్తం 150 మంది నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. కూల్చివేతకు బాధ్యత వహిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ మహమ్మద్ సలీం, ఇతరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
!['ప్రార్థనా మందిరాలు కూల్చివేయడంపై కాంగ్రెస్ ఫిర్యాదు' anjan kumar yadav](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7831344-524-7831344-1593511694609.jpg)
anjan kumar yadav
ఫిర్యాదు చేసిన వారిలో హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ ప్రతినిధి సయ్యద్ నిజాముద్దీన్, హైదరాబాద్ కాంగ్రెస్ మైనారిటీల విభాగం ఛైర్మన్ సమీర్ వల్లిల్లాలు ఉన్నారు. ప్రభుత్వం మూడు ప్రార్థనా మందిరాలను ఒకే స్థలంలో పునర్నిర్మించే వరకు కొత్త సచివాలయం నిర్మాణం చేపట్టవద్దని అన్నారు.