హైదరాబాద్ జనాభా రోజురోజుకు పెరిగిపోతోంది. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వచ్చే వారితో నగరం విస్తరిస్తోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిత్యం సుమారు 50లక్షల వాహనాలు రహదారులపై తిరిగుతున్నాయి. రద్దీని నియంత్రించేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా.. వాహనదారులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు.
సైబర్ నేరాలు.. శాంతి భద్రతలు
హైదరాబాద్‌లో రోజు వందల మంది సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు సూచిస్తున్నా.. సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడటం లేదు. అక్కడక్కడ శాంతిభద్రతల సమస్యలు కూడా తరచూ తలెత్తుతున్నాయి. మహిళలు, చిన్నారులపై దాడులు, ప్రతీకార హత్యలు జరుగుతున్నాయి. ప్రజల భాగస్వామ్యంతోనే వీటిని అదుపులోకి తెచ్చేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సీ)కు శ్రీకారం చుట్టారు.
ప్రజలే భాగస్వాములు...
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఛైర్మన్‌గా వ్యవహరించే హెచ్సీఎస్సీకు పోలీస్ ఉన్నతాధికారులు, నగర పరిధిలోని ప్రముఖులతో పాటు పారిశ్రామివేత్తలు, వ్యాపారులు, ప్రజలు సభ్యులుగా ఉంటారు.
సోషల్ మీడియా ద్వారా..
ఆప్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అనే నినాదంతో సెక్యూరిటీ కౌన్సిల్ పనిచేయనుంది. పోలీసులకు, ప్రజలకు వారథిగా హెచ్సీఎస్సీ ముందుకు వెళ్తోంది. కమిషనర్ ఆధ్వర్యంలోని కౌన్సిల్ కార్యచరణ రూపొందిస్తుంది. జోన్లవారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారు. సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
ప్రత్యేక జోన్ల ఏర్పాటు..
ప్రధానంగా మహిళలు, చిన్నారుల భద్రత, రహదారి భద్రత, సైబర్ భద్రత, పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించేలా చర్యలు తీసుకోవడం దీని ప్రధాన లక్ష్యం. దీనికోసం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 5 జోన్లలోనూ ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఆయా జోన్ల డీసీపీలు ఛైర్మన్లుగా వ్యవహరిస్తారు. స్థానిక యువత, విద్యార్థులను భాగస్వాముల్ని చేస్తారు. రహదారి భద్రత, సైబర్ నేరాల బారిన పడకుండా ఎలా ఉండాలనే అంశాలపై జాగ్రత్తలు సూచిస్తారు.
ప్రారంభోత్సవంలోనే రూ.75 లక్షలు..
హెచ్సీఎస్సీకి పలువురు విరాళాలు కూడా అందజేస్తున్నారు. ఈ నెల14న నిర్వహించిన ప్రారంభోత్సవంలోనే రూ.75 లక్షల జమ అయ్యాయి. ఈ డబ్బుతో పలు కార్యక్రమాలు నిర్వహించి... ప్రజాభాగస్వామ్యంతో హైదరాబాద్ మహానగరాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు తోడ్పాటును అందిస్తుంది.
హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌కు శ్రీకారం ఇవీ చూడండి:వాతలు పెట్టి, తాళ్లతో బంధించి... నరకం చూపారు